కూటమి ప్రభుత్వం అధకారంలోకి వచ్చాక వీసీలతో బలవంతంగా రాజీనామా చేయించారని ఆరోపించారు బొత్స సత్యనారాణ. మండలిలో మాట్లాడిన బొత్స..వీసీల రాజీనామాలపై ప్రభుత్వం తప్పు లేకపోతే విచారణ జరిపించాలన్నారు. 17 మంది వీసీలతో బలవంతంగా రాజీనామా చేయించారు… వీసీలను గవర్నర్ నియమిస్తే ప్రభుత్వం ఎలా జోక్యం చేసుకుంటుందని ప్రశ్నించారు.
మూకుమ్మడిగా నాలుగు రోజుల్లో 17 మంది వీసీలు ఎందుకు రాజీనామా చేశారు. ఒకే సారి అంత మంది రాజీనామా చేస్తే ఎందుకు ప్రభుత్వం అంగీకరించిందని ప్రశ్నించారు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి. వీసీల విషయంలో ప్రభుత్వం జోక్యం ఎందుకు? అని మండిపడ్డారు.
ప్రభుత్వం తప్పు లేకపోతే విచారణ జరిపించండి అంటూ బొత్స డిమాండు చేశారు. విచారణకు అంగీకరించేది లేదని భీష్మించడంతో వైయస్ఆర్‌సీపీ సభ్యులు విచారణకు పట్టబట్టారు. ఈ క్రమంలో మండలి చైర్మన్ సభను వాయిదా వేశారు.