Saturday, May 3, 2025
- Advertisement -

వైసీపీలో జోష్..బొత్స ఏకగ్రీవం

- Advertisement -

విశాఖపట్నం స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బొత్సకు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు రిటర్నింగ్ అధికారి. ఎమ్మెల్సీ ఎన్నిక కోసం బొత్సతో పాటు పోటీపడ్డారు స్వతంత్ర అభ్యర్థి షేక్ షఫీ. దీంతో మొత్తం నామినేషన్లు దాఖలయ్యాయి. ఎన్నికల్లో బలం లేకపోవడంతో పోటీకి దూరంగా ఉంది టీడీపీ.

ఇక నామినేషన్ల ఉపసంహరణ గడువు లోపే స్వతంత్ర అభ్యర్థి పోటీ నుండి తప్పుకున్నారు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం అయింది. గెలుపు అనంతరం మాట్లాడిన బొత్స..వరలక్ష్మీ ఆశీసులతో రాష్ట్ర ప్రజలు శుభంగా ఉండాలని శ్రావణ శుక్రవారం రోజున కోరుకుంటున్నానని అన్నారు.

రాబోయే కాలంలో జిల్లా అభివృద్ధే ద్యేయంగా, ఒకే మాటతో, ఒకే విధానంతో పనిచేస్తామని చెప్పారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు జేసీ సర్టిఫికెట్ అందజేశారని తెలిపారు. తనకు బీ ఫామ్ ఇచ్చి పోటీకి దింపిన జగన్ కు, పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -