Saturday, May 3, 2025
- Advertisement -

బొత్స నామినేషన్..గెలుపు తనదేనని ధీమా!

- Advertisement -

విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఈ సందర్భంగా మాట్లాడిన బొత్స..సీఎం చంద్రబాబు వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. చంద్రబాబు రాజకీయాలను వ్యాపారం చేశారని మండిపడ్డారు.

బలం లేకున్నా ఓ వ్యాపార వేత్తను పోటీలో దించి డబ్బులతో ప్రలోభ పెట్టాలని చూస్తున్నారన్నారు. మెజారిటీ లేకున్న ఎందుకు పోటీ పెడుతున్నారని ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలుపు తనదేనని…వైసీపీకి 620 ఓట్లు ఉన్నాయని టీడీపీకి 200 ఓట్లు కూడా లేవన్నారు. తాను విలువలతో కూడిన రాజకీయాలు చేస్తానని చెప్పారు.

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పరిధిలో మొత్తం 838 ఓటర్లు ఉండగా ఇందులో మెజార్టీ ఓట్లు వైసీపీవే. టీడీపీ ఎమ్మెల్పీ అభ్యర్థిగా బైరా దిలీప్ చక్రవర్తి పేరు ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. రేపటితో నామినేషన్లకు చివరి తేది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -