Saturday, May 3, 2025
- Advertisement -

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స

- Advertisement -

ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థలకు ఎన్నికల నగారా మోగిన సంగతి తెలిసిందే. వైసీపీకి మెజార్టీ ఉన్న ఈ స్థానం నుండి ఆ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేరును ఖరారు చేశారు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్. ఉమ్మడి విశాఖ జిల్లా నాయకుల సమావేశంలో అందరి అభిప్రాయాలను తీసుకున్న జగన్….అనంతరం బొత్స పేరును ఫైనల్‌ చేశారు. ఇక బొత్స అయితేనే వైసీపీ విజయం మరింత సులువు అవుతుందని భావించారు జగన్.

ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిధిలో విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, జిల్లా ప్రజాపరిషత్, మండల ప్రజాపరిషత్‌ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

ఆగస్టు 6న ఉపఎన్నిక నోటిఫికేషన్‌ విడుదలకానుంది. అదేరోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుండగా ఆగస్టు 13 వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు ఉంది. 14న పరిశీలన,ఆగస్టు 16న ఉపసంహరణకు గడువు . ఆగస్టు 30న ఉదయం 8 నుంచి సాయంత్రం 4గంటల వరకు ఉపఎన్నిక జరగనుంది. సెప్టెంబరు 3న ఫలితాలు రిలీజ్ కానుండగా సెప్టెంబరు 6వ తేదీతో ఎన్నికల ప్రక్రియ ముగియనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -