Saturday, May 3, 2025
- Advertisement -

గెలవడానికి అడ్డగోలు హామీలు..ఇప్పుడు నిధులు లేవంటూ కబర్లు!

- Advertisement -

అనుభవం ఉంది.. సంపద సృష్టించడం తెలుసు అంటూ గప్పాలు కొట్టే కదా ప్రజల్ని మభ్యపెట్టి టీడీపీ అధికారంలోకి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడకుండా కూటమి ప్రభుత్వం ఎందుకు రూ.15వేల కోట్ల ఖర్చుని భరించకూడదు? చెప్పాలన్నారు. ఐదేళ్లు కరెంట్ ఛార్జీలు పెంచమని హామీలిచ్చి.. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే రూ.15 వేల కోట్లు ప్రజలపై భారమా? అని ప్రశ్నించారు.

శాసనమండలి విపక్ష నేత వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని ముస్లింలు కోరుతున్నా.. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అన్నారు మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా. పార్లమెంట్‌లో ఈ బిల్లుని వైసీపీ వ్యతిరేకించిందని…బీజేపీతో కలిసి వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని కొట్టేయడానికే టీడీపీ, జనసేన ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు.

జగన్‌ రాజ్యాంగబద్ధంగా వేసిన వక్ఫ్ బోర్డు కమిటీకి 2028 వరకూ కాలపరిమితి ఉందని కానీ రాజకీయ దురుద్దేశంతో ఆ బోర్డు కమిటీని కూటమి ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను కాజేయడానికే ఈ కుట్ర అంతా చేస్తున్నారు అన్నారు. ప్రజలకి ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం తుంగలోకి తొక్కిందని..ఎన్నికల ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లెక్కలేనన్ని హామీలిచ్చి ఇప్పుడు నిధులు లేవంటూ కబుర్లు చెప్తున్నారన్నారు. ఒక్క హామీని కూడా ఈ 6 నెలల్లో నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -