- Advertisement -
ఏపీ బడ్జెట్ పై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. బడ్జెట్ అత్మస్తుతి పర నిందలా ఉందన్నారు. బడ్జట్ ప్రసంగం సీఎం చంద్రబాబు, లోకేష్ ను పొగడటంతోనే సరిపోయిందన్నారు.
సూపర్ సిక్స్ హామీలను ప్రభుత్వం విస్మరించిందని.. మహిళలు, విద్యార్థులు, రైతుల కోసం చేసిన కేటాయింపులు అరకొరగా ఉన్నాయి అన్నారు. అమ్మకు వందనంకు కేటాయింపులు సక్రమంగా లేదు అన్నారు.
రైతు భరోసాకు 12 వేల కేటాయింపు ఉండాలి.. నిరుద్యోగ భృతి విస్మరించారు అన్నారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఊసే లేదు అన్నారు బొత్స సత్యనారాయణ.