Saturday, May 3, 2025
- Advertisement -

పీకేను అందుకే పక్కన పెట్టాం!

- Advertisement -

ప్రశాంత్ కిషోర్ చేసిన కామెంట్స్‌పై స్పందించారు మంత్రి బొత్స సత్యనారాయణ. పీకే ఓ క్యాష్ పార్టీ అని..ఆయన్ని అందుకే పక్కన పెట్టామన్నారు బొత్స. మీడియాతో మాట్లాడిన బొత్స..గిమ్మిక్కులు చేయడంలో ప్రశాంత్ దిట్ట అని..అందుకే అతడిని పక్కకు పెట్టామన్నారు.

ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చెప్పడానికి ప్రశాంత్ కిషోర్ ఏమైనా బ్రహ్మ అని ప్రశ్నించారు. ప్రశాంత్ కిషోర్ అయినా, ఐ-ప్యాక్ అయినా తాత్కాలికం… వైసీపీ శాశ్వతం అని స్పష్టం చేశారు. చెప్పిన వారికే టిక్కెట్లు ఇచ్చారనేది అవాస్తవం అన్నారు. మేం చాలా క్లారిటీగా ఉన్నాం.. 175 సీట్లు వస్తాయి. మేం మేలు చేస్తేనే ఓటేయండని అడిగిన జగన్.. దేశ రాజకీయాల్లో చరిత్ర సృష్టించారన్నారు.

ఎన్నికలయ్యాయి.. ఫలితాలు రావాల్సి ఉంది. ఎవరి ధీమా వారికుంది. మేం ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాం అన్నారు. చంద్రబాబు ఎక్కడికెళ్లారో ఎందుకు చెప్పడం లేదు..? చెప్పాల్సిన అవసరం లేదంటే ఓకే. అటువంటప్పుడు జగన్ పర్యటనల మీద ఎందుకింత చర్చ..? ఆలోచించాలన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -