Monday, May 5, 2025
- Advertisement -

బొత్స వర్సెస్ లోకేష్..మండలిలో వాగ్వాదం!

- Advertisement -

శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి నారా లోకేష్ వర్సెస్ వైసీపీ బొత్స సత్యనారాయణ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.. కొత్త విద్యావిధానాన్ని కాషాయీకరణ చేశారంటూ వైసీపీ ఎమ్మెల్సీ రవీంద్రబాబు ఆరోపించారు. హిందూమతం, హిందూ దేవుళ్లు అంటూ పలు అంశాలు పెట్టారని చెప్పగా మంత్రి లోకేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైసీపీ నేతలు ఏపీని తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. సభలో కుల, మతాలను తీసుకురావద్దని అన్నారు. విద్యలోకి రాజకీయాలు, మతాన్ని తీసుకొచ్చి వివాదాస్పదం చేయవద్దని అన్నారు. తమ మాటలు తప్పుగా ఉంటే రికార్డుల నుంచి తొలగించాలని మాజీ మంత్రి, శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తెలిపారు.

ఈ వ్యాఖ్యలను తొలగించాలన్న బొత్స సత్యనారాయణ సూచనను మంత్రి లోకేష్‌ స్వాగతించారు. గత ప్రభుత్వ హయాంలో విద్యా ప్రమాణాలు పూర్తిగా వెనుకబడి పోయాయని టీడీపీ సభ్యులు చెప్పగా వైసీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లరనడం సరికాదని, మంత్రి కి ఈ లెక్క ఎక్కడి నుంచి వచ్చిందో తెలియడం లేదని బొత్స పేర్కొన్నారు.

ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి ఏనాడూ 12 లక్షల మంది విద్యార్ధులు ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేట్ పాఠశాలలకు బదిలీ అయిన సందర్భం లేదు. సౌకర్యాలు లేవనడం కరెక్ట్ కాదు అన్నారు బొత్స. సౌకర్యాలపై సభ్యులందరినీ తీసుకెళ్లి స్టడీ టూర్ పెట్టండి. 2014-19 మధ్య స్కూల్స్ ఎలా ఉన్నాయి, 2019-24 మధ్య ఎలా ఉన్నాయో పెద్దలతో గ్రామసభలు పెట్టి చర్చిద్దాం అన్నారు. తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా ప్రోత్సహించాలన్నదే మా విధానం. ప్రాధమిక విద్య నుంచి టోఫెల్ విద్యను నేర్పించడం.. ఇంగ్లీష్ మీడియంలో ఐబి విద్యను అందించడం.. సెంట్రల్ సిలబస్ సిబిఎస్ఈని ప్రవేశపెట్టాం అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -