వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళుర్పించారు వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు.
చంద్రబాబూ విజయవాడలో ఏర్పాటుచేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ప్రైవేటీకరించాలన్న ఆలోచన మానుకో అని వైసీపీ నేతలు సూచించారు. అంబేద్కర్ విగ్రహంతో వ్యాపారం చేయాలనుకోవడం దుర్మార్గం.. స్వరాజ్ మైదానంలో పీపీపీ విధానాన్ని అడ్డుకుంటాం, చంద్రబాబు దుర్మార్గాలను ఎండగడతాం అని వెల్లడించారు.
బీఆర్ అంబేద్కర్ స్పూర్తిని ముందుకుతీసుకువెళ్ళింది వైఎస్ జగన్ మాత్రమే… రానున్న రోజుల్లో జగన్ గారిని మరోసారి సీఎం పీఠంపై కూర్చోపెట్టి అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు షేక్ ఆసిఫ్, అంకంరెడ్డి నారాయణమూర్తి, వేల్పుల రవికుమార్, ఎన్.చంద్రశేఖర్ రెడ్డి, దొంతిరెడ్డి వేమారెడ్డితో పాటు పలువురు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.