Saturday, May 3, 2025
- Advertisement -

అదానీకో న్యాయం.. ఆడబిడ్డకో న్యాయమా?

- Advertisement -

అదానీ గ్రూప్స్‌ అధినేత గౌతమ్‌ అదానీపై యూఎస్‌లో అభియోగాలు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ..కాంగ్రెస్, బీజేపీ టార్గెట్‌గా విమర్శలు గుప్పిస్తోంది. ఈ నేపథ్యంలో స్పందించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఎక్స్‌లో ప్రధాని నరేంద్రమోడీకి ట్వీట్ చేసిన కవిత.. అదానీకో న్యాయం.. ఆడబిడ్డకో న్యాయమా? చెప్పాలన్నారు. ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్ట్ చేయడం ఈజీ. ఆధారాలు ఉన్నా అదానీని అరెస్ట్ చేయడం మాత్రం కష్టమా? చెప్పాలన్నారు. ఎన్నిసార్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చినా ప్ర‌ధాని అదానీ వైపేనా? చెప్పాలని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.

అగ్రరాజ్యం అమెరికానే మోసం చేయాలని చూసిన ఘనుడు.. భారత ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వజూపిన మోసగాడని విమర్శించారు కేటీఆర్.అదానీతో కాంగ్రెస్‌, బీజేపీ అనుబంధం దేశానికి అవమానం, అరిష్టమన్నారు. రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఎంత ఇవ్వజూపిండో, మూసీలో అదానీ వాటా ఎంతో అంటూ ప్రశ్నించారు. ఇలాంటి మోసగాడికి.. దగాకోరుకా.. తెలంగాణలో పెట్టుబడుల అనుమతులు ఎలా ఇచ్చారంటూ మండిపడ్డారు.

తక్షణం అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ అనుమతులను రద్దు చేయాలని.. అదానీతో చేసుకున్న చీకటి ఒప్పందాలు అన్నీ బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణలో ఆస్తులను కొల్లగొట్టే మీ కుయుక్తులలో మీ భడే భాయ్ వాటాఎంత ? మీ అదానీ భాయ్ వాటా ఎంత? మీ హైకమాండ్ వాటా ఎంత? అంటూ ఎక్స్ వేదికగా నిలదీశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -