Wednesday, May 7, 2025
- Advertisement -

ప్రజా తీర్పును గౌరవించాం కానీ టీడీపీ నేతలు చేస్తుందేంటి?

- Advertisement -

నంద్యాల జిల్లా డోన్ లో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రోజు మార్నింగ్ వాక్‌కు వెళ్లే పార్కును మూసివేశారు. తాను వాకింగ్ చేసే మున్సిపల్ పార్కుకు తాళం వేశారంటూ మండిపడ్డారు. ప్రజలు తమను ఓడిస్తే సంతోషంగా ప్రజా తీర్పున స్వీకరించాం కానీ ప్రజల ఓట్లతో గెలిచిన వాళ్ళు ఇలాంటి పనులు చేయటం దేనికి సంకేతం అని ప్రశ్నించారు.

పార్కుకు తాళం వేయడం స్థానిక ఎమ్మెల్యే పనే అని దుయ్యబట్టారు బుగ్గన. ఇక గేటుకు తాళం వేసి ఉండడంతో ఆయన వెనుతిరి గారు. ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించింది మంచి చేయడానికి కానీ ఇలా లాక్ చేయడానికి కాదు అని చురకలు అంటించారు.

ఈ పార్కులో ప్రజలు చాలామంది వాకింగ్ చేస్తారు వారి ఆరోగ్యం కోసమే ఈ పార్కును నిర్మించినేది .. నేను షటిల్ బ్యాట్ పట్టుకుంటే షటిల్ కోర్టును కూడా తాళం వేస్తారేమో అని తనదైన శైలీలో విమర్శించారు. నేను బస్సును ఎక్కితే ఆర్టీసీని బంద్ చేస్తా రేమో అని ఎమ్మెల్యే పై ఫైర్ అయ్యాడు.. వీలైతే ప్రజలకు మంచి చేయి కాని ఇలా లాక్ చేయొద్దని అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -