మద్యంలో ప్రైవేటు వ్యక్తులకు పోయే ఆదాయాన్ని ప్రభుత్వానికి వచ్చేలా చేసింది వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం అన్నారు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. ఆ ఆదాయాన్ని పూర్తిగా సంక్షేమ పథకాల కోసమే ఖర్చు చేసింది అని తెలిపారు. మీడియాతో మాట్లాడిన బుగ్గన.. దీన్ని గతంలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ తప్పు పట్టింది. గతంలో చంద్రబాబు హయాంలో 55,500 కోట్లు ప్రభుత్వ గ్యారెంటీలు ఇచ్చింది. రాష్ట్ర అప్పు డైరెక్ట్ డెబిట్ చేసుకునే అధికారాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పడం మానుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థకు సంబంధించిన మొత్తం ఆదాయాన్ని అప్పులు, వడ్డీలు కట్టేందుకు మాత్రమే వాడేలా ఒప్పందం చేసుకుంది కూటమి ప్రభుత్వం అని ఆరోపించారు. బడ్జెట్‌లో మిస్లీనియస్ ఖర్చుల్లో దీన్ని కలిపి చూపే పన్నాగం ముందే చేసింది… దీనివల్ల అప్పుల వడ్డీ శాతం 7% నుండి 10%కి పెరుగుతోంది. ప్రైవేటు వ్యక్తులు రాష్ట్ర ఖజానా నుండి డబ్బులు తీసుకోగల అధికారాన్ని ఇస్తూ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రమాదకరం.. ఇది రాజ్యాంగ విరుద్దమన్నారు.
జగన్ మోహన్‌రెడ్డి ఇచ్చిన పథకాలను ఇవ్వడం లేదు.. ఇస్తానని చెప్పిన పథకాలూ ఇవ్వడం లేదు. ప్రశ్నించడానికే పార్టీ అని చెప్పిన పవన్ కళ్యాణ్ దీనిపై ప్రశ్నించడం లేదు. పెన్షన్లు తప్ప ఈ ప్రభుత్వం ఇచ్చిందేమీ లేదు. మరి లక్షన్నర కోట్ల అప్పు ఎక్కడికి పోయింది? బాబు షూరిటీ ఏమైంది? చెప్పాలన్నారు బుగ్గన.