Saturday, May 3, 2025
- Advertisement -

జనసేనకు గుర్తింపు..పవన్‌కు ఈసీ లేఖ

- Advertisement -

జనసేన పార్టీకి గుడ్ న్యూస్. జనసేన పార్టీని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో చేర్చింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ మేరకు జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు లేఖ రాసింది. అలాగే గాజు గ్లాస్ గుర్తును జనసేన పార్టీకి రిజర్వ్ చేసింది. దీంతో ఇకపై తెలుగు రాష్ట్రాల్లో జనసేనకు గాజు గ్లాస్ గుర్తు రిజర్వ్ అయింది.

2013లో జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే శాసనసభకు జరిగిన ఎన్నికల్లో పోలైన ఓట్లలో కనీసం ఆరు శాతం తెచ్చుకోవాలి. అలాగే రెండు అసెంబ్లీ సీట్లను గెలవాలి. అయితే 2019లో జనసేనకు ఆరు శాతం తక్కువ ఓట్లే రావడం, ఒకే అసెంబ్లీ స్థానంలో విజయం సాధించింది.

కానీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో విజయం సాధించింది. 21 అసెంబ్లీ స్థానాల్లో, 2 లోక్ సభ స్థానాల్లో గెలుపొందగా తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీగా రికగ్నైజ్ చేయడంతో జనసైనికుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -