Tuesday, April 23, 2024
- Advertisement -

చాణ‌క్య మూవీ రివ్యూ

- Advertisement -

హీరో గోపి చంద్ చాలా కాలం నుంచి హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. తాజాగా ఆయన చాణిక్య అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తిరు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాని అనీల్ సుంకర్ నిర్మించగా.. గోపీ సరసన మెహ్రీన్ హీరోయిన్ గా నటించింది. మరి ఈ రోజే రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ :

ఇండియాకి చెందిన‌ రీసెర్చ్ అండ్ వింగ్ ఉడెర్ కవర్ (రా) ఏజెంట్ గా అర్జున్ (గోపిచంద్) పని చేస్తుంటాడు. అయితే ఓ మిషన్ పనిపై బ్యాంక్ ఉద్యోగిగా పనిలో చేరుతాడు. ఈ నేపథ్యంలో అర్జున్ దారికి అడ్డుగా తగిలిన పాకిస్థాన్ కు చెందిన తీవ్రవాది ఖురేషి(సోహైల్) వల్ల ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి ? అర్జున్ ఫ్రెండ్స్ స్టోరీ ఏంటి ? స్లీపర్ సెల్స్ ఆపరేషన్ ఎలా సాగింది ? తీవ్రవాది ఖురేషి ను అర్జున్ ఏం చేశాడు ? మొత్తనికి అర్జున్ చేపటిన మిషన్ సక్సెస్ అయిందా ? లేదా ? సినిమాలో చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

గోపిచంద్ ఎప్పుడు కూడా కొత్త కథలను ఎంచుకుంటూ ముందుకెళ్తున్నాడు. మరోసారి అలాంటి కథనే ఎంచుకున్నాడు. అద్భుతంగా ఈ చిత్రంలో నటించాడు. రా ఏజెంట్ గా ఆయన కనబరిచిన నటన చాలా బాగుంది. వన్ మెన్ షోగా సినిమాని నడిపించాడు. ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ ప్రేక్షకులను షాక్ కు గురిచేస్తుంది. అద్భుతమైన లోకేషన్లలో సినిమాని తెరకెక్కించారు. ఫస్ట్ ఆఫ్ కంటే సెకండాఫ్ కాస్త ఆసక్తికరంగా సాగుతుంది. స్క్రీన్ ప్లేలో వచ్చే ట్వీస్ట్ లు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. జ‌రీన్ ఖాన్ ఐటమ్ సాంగ్ బాగుంది. మెహ్రీన్ అంద‌చందాలు సినిమాలో బాగున్నాయి. ఇతర ముఖ్య తారలు తమ పాత్రలకు న్యాయం చేశారు. వెట్రి పళనిస్వామి అందించిన సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. విశాల్ సాంగ్స్ బాగున్నాయి. శ్రీచరణ్ బ్యాక్ గ్రౌండ్ సినిమా ప్లస్ పాయింట్. నిర్మాణ విలువలు బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

సినిమా కథ బాగున్నప్పటికి కథనం వీక్ గా ఉంది. ఫ్లాట్ గా సాగే నేరేష‌న్, యాక్షన్, లవ్ ఇలా వచ్చి వెళ్తుంటాయి. తీవ్ర‌వాదం అన్న కాన్సెప్టు మరింత కొత్తగా చూపిస్తే బాగుండేది.
గోపిచంద్ నుంచి కొరుకునేవి ఫస్ట్ ఆఫ్ లో ఉండవు. రొటీన్ కామెడీ కాస్త విసుగు తెప్పిస్తుంది. ట్వీస్ట్ లు బాగున్నాయని అనుకునేలోపే నీరుగారే సీన్లు వచ్చి బోర్ కొట్టిస్తాయి. దర్శకుడు తిరు స్క్రీన్ ప్లే పై మరింత దృష్టి పెట్టాల్సింది.

చివరగా : రా ఏజెంట్ గా గోపిచంద్ ఆకట్టుకున్నాడు. కమర్షియల్ సినిమా చూసే ప్రేక్షులు సినిమాని ఎంజాయ్ చేస్తారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -