Tuesday, May 6, 2025
- Advertisement -

బెయిల్ వస్తే ఓకే..లేకపోతే!

- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబు కెరీర్‌లోనే ఇది క్లిష్ట సమయం.తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదొడుకులను చూసి ఉంటారు కానీ ఇలాంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా ఉహించిఉండరు. తాను మిస్టర్‌ క్లీన్ అని, ఐటీకి బ్రాండ్ అంబాసిడర్‌ అని చెప్పుకునే బాబుకు ఇవి నిజంగా చీకటిరోజులే. టీడీపీ ఉన్నంతకాలం అవినీతి మరకలను మోయాల్సిందే. ఇక ఇప్పటికే ఈ కేసులో 16 రోజులు రిమాండ్‌లో ఉన్న బాబుకు మరో 11 రోజుల రిమాండ్‌ని పొడగించింది ఏసీబీ కోర్టు. దీంతో అక్టోబర్ 5 వరకు బాబు జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి.

ఇక చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది. అయితే బాబుకు బెయిల్ వస్తుందా రాదా అన్నది సస్పెన్సే. సీఐడీ కస్టడీ ముగిసిన తర్వాత చంద్రబాబును వర్చువల్‌గా న్యాయమూర్తి ముందు హాజరు పర్చగా ఆయన తరపు లాయర్లతో కీలక వ్యాఖ్యలు చేశారు జడ్జి. కేసు విచారణలో ఉన్న సమయంలో పదేపదే బెయిల్ పిటిషన్లు దాఖలు చేయడం వల్ల కోర్టు సమయం వృధా అవుతుందని అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది.

దీంతో బాబుకు బెయిల్ వస్తుందా అంటే నూటికి నూరు శాతం కష్టమేనని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక బెయిల్ సంగతి పక్కన పెడితే బాబు నెత్తిన మరో బాంబు పడే అవకాశం ఉంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్ స్కాంలో చంద్రబాబుపై జారీ అయిన రెండు పీటీ వారెంట్లపైనా ఇవాళ విచారణ జరిగే అవకాశం ఉంది. దీంతో స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో బెయిల్ వచ్చినా ఈ రెండు కేసుల్లో బాబు మళ్లీ అరెస్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.దీనికి తోడు స్కిల్ స్కాంలో మరిన్ని రోజులు చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని సీఐడీ పిటిషన్ దాఖలు చేయాలని భావిస్తున్న నేపథ్యంలో బెయిల్ రావడం బాబుకు తప్పనిసరి. లేకపోతే మరిన్ని రోజులు కాదు నెలలు బాబు జైలులో ఉన్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న వాదన వినిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -