Saturday, May 3, 2025
- Advertisement -

బాబు ష్యూరిటీ…మోసం గ్యారెంటీ!

- Advertisement -

చంద్రబాబు పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు వైసీపీ అధినేత జగన్. అసలు చంద్రబాబుకు సీఎంగా ఉండే అర్హత లేదన్నారు. ప్రభుత్వం ప్రజల సొమ్ముతో, ప్రజల కోసం నడుస్తుంది. ఇదే పెద్ద మనిషి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏమన్నాడు? పక్షపాతానికి, రాగ ద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తానని కానీ ఇప్పుడు ఇంత దారుణంగా మాట్లాడుతున్నారని అన్నారు. ఆ మాటలు ఏ జడ్జి అయినా, గవర్నర్‌ అయినా వింటే, ఆ మనిషిని ఒక్క నిమిషం అయినా, సీఎంగా కొనసాగించడం ధర్మమేనా? చెప్పాలన్నారు.

బాబు ష్యూరిటీ.. భవిష్యత్తు గ్యారెంటీ కాస్త బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ అయ్యింద‌ని ధ్వ‌జ‌మెత్తారు. పరనింద..ఆత్మస్తుతి సూపర్‌సిక్స్, మేనిఫెస్టోలో 143 హామీల గురించి అడిగితే సమాధానం రాదు. ఏది చెప్పినా అబద్ధం. ఏది చెప్పినా మోసం అన్నారు. యువతకు ఉద్యోగాలకు సంబంధించి ఇచ్చిన హామీ. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి. 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేవరకు అది ఇస్తామన్నారు కానీ, గత ఏడాది బడ్జెట్‌లో ఆ ప్రస్తావన లేదు అన్నారు.

50 ఏళ్లకే పెన్షన్‌ అన్నాడు. అంటే మరో 20 లక్షల కుటుంబాలు యాడ్‌ అవుతాయి. వారికి రూ.4 వేల చొప్పున లెక్క వేస్తే రూ.9,600 కోట్లు కేటాయించాలి కానీ తొలి ఏడాది ఒక్క రూపాయి కేటాయించలేదన్నారు. మా హయాంలో ఇచ్చిన పెన్షన్లు 66,34,372… అవి మేము దిగిపోయే నాటికి ఇచ్చిన పెన్షన్లు. అదే ఈరోజు చంద్రబాబు పాలనలో 62,10,969కి పడిపోయాయి. కొత్తగా ఒక పెన్షన్‌ ఇవ్వకపోగా, ఉన్నవే తగ్గిస్తూ పోతున్నారు. ఇప్పటికే దాదాపు 4 లక్షల పెన్షన్లు తగ్గించారు అని మండిపడ్డారు. పెన్షన్ల కోసం మామూలుగా రూ.32 వేల కోట్లు కావాలి. కానీ ఈ బడ్జెట్‌లో కేటాయించింది కేవలం రూ.27 వేల కోట్లు…అంటే పెన్షన్‌ వ్యయం రూ.5 వేల కోట్లు తగ్గింది. పెరగాల్సింది పోయి బడ్జెట్‌ తగ్గిందన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -