చంద్రబాబు రాజకీయ జీవితం అబద్దాలతోనే సాగిందన్నారు వైసీపీ నేత మేరుగ నాగార్జున. వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతివ్వడం పై ముస్లిం సమాజం ఆగ్రహంగా ఉందని గ్రహించిన చంద్రబాబు దాని నుంచి దృష్టి మళ్ళించేందుకు డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. వక్ఫ్ సవరణ బిల్లు సందర్భంగా వైసీపీ విప్ జారీ చేయలేదంటూ చంద్రబాబు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారానికి తెగబడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. టీడీపీ చేసిన ద్రోహాన్ని ముస్లిం మైనార్టీలు చర్చించుకుంటున్నారు అన్నారు.
చాలా స్పష్టంగా వైయస్ఆర్‌సీపీ రాజ్యసభలో జారీ చేసిన విప్‌ను కూడా ఈ మీడియా సమావేశంలో ప్రదర్శిస్తున్నాను. గతంలోనే ఈ బిల్లును వైయస్ఆర్‌సీపీ పూర్తిగా వ్యతిరేకిస్తోందని పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ చాలా స్పష్టంగా చెప్పారు అని గుర్తు చేశారు. మైనార్టీలకు వైసీపీ అండగా ఉంటుందని, వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్దమంటూ పార్టీ ఎంపీ, పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి రాజ్యసభలో మాట్లాడిన మాటలను దేశమంతా టీవీల్లో చూసిందని చెప్పారు.
ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన నాటి నుంచి నిన్నటి అప్పులకు సంబంధించిన అబద్దాల నుంచి నేటి పీ4 కార్యక్రమం వరకు చంద్రబాబు చెప్పిన పచ్చి అబద్దాలేనన్నారు. చంద్రబాబు రాజకీయ జీవితమే అబద్దాలతో నిండిపోయిందని చురకలు అంటించారు.