అమ్మ పెట్టదు…అడుక్కొనివ్వదు, ఇప్పుడు ఇదే ఏపీ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా కనిపిస్తోంది. సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు ప్రజల నెత్తిన బారాన్ని మోపుతూ తన వైఫల్యాన్ని వైసీపీపై పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వ 9 నెలల పాలనలోనే ప్రజా వ్యతిరేకత మొదలుకాగా ఆ పార్టీ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలపై ప్రజలు నిలదీస్తున్నారు.
ఓ వైపు ధరల పెంపు.. మరోవైపు కూటమి నేతల ఆగడాలు శృతి మించుతుండగా వెరసీ సామన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
తాజాగా వైసీపీ హయాంలో వచ్చిన హౌసింగ్ స్కీమ్‌లో అక్రమాలు జరిగాయంటూ పేదల నుండి భూములు లాక్కునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ పాలనలో చాలా మంది అక్రమార్కులు ఇళ్లు వచ్చాయనే పేరుతో పేదవారి నుండి ఇళ్ల స్థలాలను తిరిగి తీసుకునేందుకు రెడీ అవుతోంది ప్రభుత్వం. ఇక ఈ ప్రక్రియ అంతా 5 రోజుల్లోనే పూర్తి కావాలని ఆదేశించారంటే చంద్రబాబు ఎంత స్పీడుగా పేదలకు గండి కొట్టేందుకు సిద్ధమవుతున్నారో అర్థం చేసుకోవచ్చని పలువురు ఆరోపిస్తున్నారు.
సీఎం ఆదేశాలతో ఇప్పటికే రెవెన్యూ శాఖ అధికారులు పని మొదలుపెట్టారు కూడా. ఏయే గ్రామాల్లో, ఏయే మండలాల్లో ఎంతమంది లబ్ది పొందారో, వారు దరఖాస్తులతోపాటూ.. ఏయే పత్రాలు సమర్పించారో అవన్నీ క్రాస్ చెక్ చేస్తున్నారు. క్రాస్ చెక్ తర్వాత పేదల ఇళ్ల స్థలాలు తిరిగి తీసుకుంటారని ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది. మొత్తంగా చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు పేద ప్రజల పాలిట షాపంగా మారాయి.