Saturday, May 3, 2025
- Advertisement -

చంద్రబాబే సంపన్న సీఎం!

- Advertisement -

దేశంలో అత్యధిక ధనవంతులైన ముఖ్యమంత్రుల జాబితాలో చోటు దక్కించుకున్నారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు. దేశంలో వివిధ రాష్ట్రాల సీఎంల ఆస్తులకు సంబంధించి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (న్యూ) సంయుక్తంగా ఓ జాబితాను విడుదల చేశాయి.

ఈ జాబితాలో ఏపీ సీఎం చంద్రబాబు తొలిస్థానంలో ఉన్నారు.చంద్రబాబు నాయుడు ఆస్తులు రూ. 931 కోట్లు. అప్పు రూ.10కోట్లు ఉంది. చంద్రబాబు పేరిట రూ.36కోట్ల ఆస్తులుండగా, ఆయన సతీమణి భువనేశ్వరి పేరట రూ.895 కోట్ల ఆస్తులున్నాయి. ఇందులో హెరిటేజ్ ఫుడ్స్ లో ఉన్న షేర్లనూ కలిపి నివేదిక లెక్కించింది

చంద్రబాబు తర్వాత అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా ఖండూ, కర్ణాటక సీఎం సిద్దరామయ్య నిలిచారు. పేమా ఖండూ ఆస్తులు రూ.332 కోట్లు కాగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆస్తుల విలువ రూ. 51 కోట్లుగా నివేదిక పేర్కొంది.

ఇక దేశంలో తక్కువ సంపద కలిగిన ముఖ్యమంత్రిగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిలిచారు. ఆమె ఆస్తుల విలువ రూ.15లక్షలు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆస్తులు రూ. 30 కోట్లకుపైగానే ఉన్నాయి. అత్యధిక క్రిమినల్ కేసులున్న ముఖ్యమంత్రిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిలిచారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -