Saturday, May 3, 2025
- Advertisement -

గంటాపై చంద్రబాబు సీరియస్!

- Advertisement -

ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్‌పై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇందుకు కారణం ఆయన ఎక్స్‌లో చేసిన పోస్టే. ఆంధ్రా టు ఆంధ్రా వయా తెలంగాణ అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు గంటా.

ఉ.8గంటలకు విశాఖ నుంచి బయలుదేరితే హైదరాబాద్ కు చేరి అక్కడి నుంచి అమరావతి వచ్చే సరికి మ.1 గంట అయ్యిందన్నారు గంటా. ఈ నేపథ్యంలో గంటా పోస్టుపై టీడీపీ హైకమాండ్ సీరియస్ అయింది. ఏదైనా ఉంటే అధిష్టానం దృష్టికి తీసుకురావాలి కానీ ఇలా పబ్లిక్‌గా పోస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. అయినా విమానయాన శాఖ మంత్రి మనవారే కదా.. రామ్మోహన్ నాయుడికి ఫోన్ చేయొచ్చు కదా అంటూ ఆగ్రహం చేసినట్లు టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఉత్తరాంధ్రకే చెందిన కేంద్ర పౌర విమానయానమంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నా ఇలా విమాన సర్వీసులు రద్దు కావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఆయన ఇప్పటివరకూ నోరు మెదపలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -