ఏపీలో అధికారంలోకి వచ్చాక మళ్లీ టీటీడీపీపై దృష్టి సారించారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇందులో భాగంగా రేపు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కానున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అనంతరం తెలంగాణ టీడీపీ నేతలతో భేటీ కానున్నారు బాబు.
వాస్తవానికి ఎన్నికలకు ముందు బీసీ నేత కాసాని జ్ఞానేశ్వర్‌కు బాధ్యతలు అప్పజెప్పారు చంద్రబాబు. అయితే తెలంగాణ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని చంద్రబాబు నిర్ణయించిన నేపథ్యంలో కాసాని టీడీపీని వీడి బీఆర్ఎస్‌లో చేరారు. ఇక అప్పటినుండి టీటీడీపీకి అధ్యక్షుడు లేరు.
అయితే ఏపీ ఎన్నికల్లో అధికారంలోకి రావడంతో పార్టీ బలోపేతంపై బాబు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈనెల 7న హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో పార్టీ నేతలతో సమావేశం అనంతరం ఓ నిర్ణయానికి రానున్నారు చంద్రబాబు. టీటీడీపీ అధ్యక్ష రేసులో సామ భూపాల్ రెడ్డి, నర్సిరెడ్డి,కాట్రగడ్డ ప్రసూన పేర్లు వినిపిస్తున్నాయి. అయితే నాయకులు తప్ప కేడర్ లేని చంద్రబాబు తెలంగాణలో పార్టీని ఏ విధంగా బలోపేతం చేస్తారో వేచిచూడాలి.