Monday, May 5, 2025
- Advertisement -

విదేశాల్లో చదివి వీధి పోరాటం చేయలా?

- Advertisement -

ఏపీలో ప్రజాస్వామ్యం లేదని, విదేశాల్లో చదివిన వాడిని వీధి పోరాటాలకు సిద్ధం చేస్తున్నారని మండిపడ్డారు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. మోహిత్ రెడ్డిపై 307 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు నమోదైన నేపథ్యంలో స్పందించిన భాస్కర్ రెడ్డి.. నా కొడుకు వయస్సు 25 ఏళ్లు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి ప్రజా జీవితంలోకి వచ్చాడన్నారు.

అక్రమ కేసులో అరెస్ట్‌ చేయించారని..విదేశాల్లో చదివిన నా కొడుకుని వీధి పోరాటాలకు సిద్ధం చేస్తున్నారు అని దుయ్యబట్టారు.చంద్రబాబుకు కృతజ్ఞతలు. నేను విద్యార్థి దశ నుంచే ఉద్యమాలతో పెరిగినవాడిని… నాకన్న మించి నా కొడుకు ప్రజల పక్షాన నిలబడి ప్రజా పోరాటాలు ఎలా ఉంటాయో ఈ ప్రభుత్వానికి, ఈ పోలీసు అధికారులకు రుచి చూపిస్తారని తేల్చిచెప్పారు.

ఎన్నికల సమయంలో చంద్రగిరి టీడీపీ అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే పులివర్తి నాని పై జరిగిన కారు దాడిలో మోహిత్ రెడ్డిపై 307 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని తిరుపతి పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకోగా అనంతరం 41ఏ నోటీసులు ఇచ్చి విడిచిపెట్టారు. ఈ కేసులో ఇప్పటి వరకూ 34 మందిని అరెస్టు చేసి జైలుకు పంపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -