కుప్పం..టీడీపీ అధినేత చంద్రబాబు కంచుకోట. 1989 నుండి కుప్పం బరిలో నిలుస్తూ వస్తున్న చంద్రబాబు విజయం సాధిస్తూనే ఉన్నారు. తాజాగా మరోసారి చంద్రబాబే బరిలో నిలవనుండగా వైసీపీ తరపున అభ్యర్థి ఎవరనే దానిపై క్లారిటీ ఇచ్చేశారు సీఎం జగన్.
బలహీన వర్గాల ప్రతినిధిగా భరత్ ను ఎమ్మెల్సీగా చేశానని తెలిపిన జగన్.. భరత్ ను కుప్పం ఎమ్మెల్యేగా గెలిపించండి.. కేబినెట్‌లో చోటు ఇచ్చి మంత్రిని చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో భరత్ వర్గీయులు సంబరాల్లో మునిగిపోయారు.
వాస్తవానికి కుప్పంలో చంద్రబాబు పట్ల అసంతృప్తి ఉంది అన్నది నిజం. ఎందుకంటే ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ వైసీపీ సత్తా చాటింది. కుప్పం మున్సిపాలిటీని టీడీపీ కొల్పోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇక సొంత నియోజకవర్గంలో టీడీపీ బీటలు వారే పరిస్థితి నెలకొనడంతో అప్పట్లో రెండు రోజుల పాటు కుప్పంలోనే మకాం వేసి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు చంద్రబాబు. ఇక రీసెంట్‌గా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కుప్పంలో పర్యటించారు. ఆము సరదాకే చంద్రబాబును 35 ఏళ్లుగా గెలిపిస్తున్నారు ఇక నుండి తనను గెలిపించాలని కోరారు. ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి కూడా. మొత్తంగా కుప్పంలో ఎలాగైనా చంద్రబాబుకు చెక్ పెట్టాలని చూస్తున్న జగన్..ఎన్నికలకు ముందే వైసీపీని గెలిపిస్తే మంత్రి పదవి ఆఫర్ చేసి పొలిటికల్ హీట్ పెంచేశారు.