ప్రజల సొమ్మును పేదలకు పంచడంలో తప్పేముంది? అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. హైడ్రా కూల్చివేతలపై మరోసారి స్పందించిన రేవంత్…కేటీఆర్…..జన్వాడ ఫాంహౌస్ అక్రమ నిర్మాణం కాదా ? దాన్ని కూల్చాలా ? వద్దా ? చెప్పాలన్నారు. హరీశ్ రావు….అజీజ్ నగర్ లో ఉన్న నీ ఫాంహౌస్ అక్రమ నిర్మాణం కాదా ? దాన్ని కూల్చాలా ? వద్దా ?, సబితా ఇంద్రారెడ్డి ఫాంహౌస్ ల లెక్కలు కూడా ఉన్నాయని స్పష్టం చేశారు.
మీ ఫాంహౌస్ లు ఎక్కడ కూలిపోతాయోనని భయపడి పేదలను రక్షణ కవచాలుగా పెట్టుకుని నాటకాలు ఆడుతున్నారు అన్నారు. అక్రమ నిర్మాణాల కూల్చివేత ఆగదని తేల్చిచెప్పారు రేవంత్. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చుట్టూ మీరు కట్టుకున్న ఫాంహౌస్ ల నుంచి వచ్చే మురికి నీటి హైదరాబాద్ ప్రజలు తాగాలా? ఆలోచించాలన్నారు.
హైడ్రాపై అసెంబ్లీలో చర్చ జరగలేదా..? అప్పుడు ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. పేదలకు ఏం చేయాలో చెప్పండి…మీ తాత సొమ్మొ, మా తాత సొమ్మొ కాదు..ప్రజల సొమ్మును పేదలకు పంచడంలో తప్పేముందన్నారు. కిరాయి మనుషులను పెట్టి మీరు చేస్తున్న హడావుడిని తెలంగాణ సమాజం గమనిస్తుందన్నారు.హైదరాబాద్ నగరాన్ని కాపాడాలని ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్తుంటే దానిపై కూడా బావబామ్మర్దులు బురద జల్లుతున్నారు అన్నారు. మీ పార్టీ ఖాతాలో తెలంగాణ సొమ్ము రూ.1500 కోట్లు ఉన్నాయి… పేదలపై మీకు అంత ప్రేమ ఉంటే ఒక రూ.500 కోట్లు మూసీ బాధితులకు, పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.