Saturday, May 3, 2025
- Advertisement -

దీపావళి అంటే చిచ్చు బుడ్లు..వాళ్లకేమో సారా బుడ్లు!

- Advertisement -

జన్వాడ ఫామ్‌హౌస్‌లో జరిగిన పార్టీపై స్పందించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మీడియాతో చిట్‌ చాట్ సందర్బంగా మాట్లాడిన సీఎం…మనకు దీపావళి పండుగ అంటే చిచ్చు బుడ్లు….వాళ్లకు మాత్రం సారా బుడ్లు అన్నారు. దీపావళి దావత్ అలా చేస్తారని మాకూ తెలియదు అని చురకలు అంటించారు.

రాజ్ పాకాల ఏ తప్పు చేయకపోతే ఎందుకు పారిపోయారు?, ఇంటి దావత్ అయితే క్యాసినో కాయిన్స్, విదేశీ మద్యం ఎందుకు ఉంటాయి? అని ప్రశ్నించారు. మొదటి ఫేజ్ లో 21 కిలోమీటర్ల మేర మూసీని అభివృద్ధి చేస్తాం అన్నారు.

గండిపేట, హిమాయత్ సాగర్ నుంచి బాపూ ఘాట్ వరకు మొదటి ఫేజ్ పనులు చేపడతాం…నెల రోజుల్లో ఇందుకు సంబంధించిన డిజైన్లు అన్నీ పూర్తి
అవుతాయి అన్నారు. బాపూ ఘాట్ వద్ద ప్రపంచంలోనే ఎత్తైన గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నాం అన్నారు. మూసీని ఎకో ఫ్రెండ్లీ అండ్ వెజిటేరియన్ కాన్సెప్ట్ తో అభివృద్ధి చేస్తాం….మూసీ వెంట అంతర్జాతీయ యూనివర్సిటీ, గాంధీ ఐడియాలజీ సెంటర్, రిక్రియేషన్ సెంటర్ మరియు నేచర్ క్యూర్ సెంటర్ లను ఏర్పాటు చేస్తాం అని వెల్లడించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -