Saturday, May 3, 2025
- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం..

- Advertisement -

హైదరాబాద్ నోవాటెల్‌లో జరిగిన సీఎల్పీ సమావేశంలో పలు కీలక సూచనలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక సమావేశం అనంతరం వెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డికి ప్రమాదం తప్పింది. నోవాటెల్ హోటల్‍లో లిఫ్ట్‌లో స్వల్ప అంతరాయం ఏర్పడింది. ఈ సమయంలో లిఫ్ట్‌లోనే ఉన్నారు రేవంత్ రెడ్డి.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నోవాటెల్ హోటల్‌లో పెనుప్రమాదం తప్పింది. సాధారణంగా ఎనిమిది మందికి మాత్రమే అనుమతించే లిఫ్ట్‌లో ఏకంగా పదమూడుమంది ఎక్కారు. దీంతో లిఫ్ట్ పనిచేయక ఒక్కసారిగా కిందకు దిగిపోవడంతో అధికారులు, హోటల్ సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

వెంటనే అప్రమత్తమైన వారు ఎలివేటర్‌ను ఓపెన్ చేసి, ముఖ్యమంత్రిని మరో లిఫ్ట్‌ ద్వారా సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సీఎం క్షేమంగా బయటపడటంతో అక్కడ ఉన్న నేతలు, అధికార సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

ఇక సమావేశం వివరాలను వెల్లడించారు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్. సన్నబియ్యం తెలంగాణలో తప్ప ఏ రాష్ట్రంలో అమలు చేయలేదని చెప్పాం అని… సమావేశంలో భూ భారతిపై పొంగులేటి వివరంగా చెప్పారు అన్నారు. బీసీ కులగణన, రేపటి నుంచి జూన్ 2 వరకు అసెంబ్లీ సెగ్మెంట్ వారిగా ప్రజలతో కలదిగరాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -