Sunday, May 4, 2025
- Advertisement -

కవితకు బెయిల్‌పై సీఎం రేవంత్‌ రెడ్డి సంచలన కామెంట్

- Advertisement -

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్‌పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్ చేశారు. మనీష్ సిసోడియాకు బెయిల్ రావడానికి 15 నెలలు సమయం పట్టిందని..ఇక ఇదే కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కి ఇప్పటికీ బెయిల్ రాలేదు అన్నారు. అయితే కవితకు ఇంత త్వరగా బెయిల్ రావడం వెనుక బీజేపీ మద్దతు ఉందనుకుంటున్నానని తెలిపారు.

ఎంపీ ఎన్నికల్లో బీజేపీ కోసం బీఆర్ఎస్ పని చేసిందని, 8 సీట్లలో బీజేపీ గెలవడానికి బిఆర్ఎస్ హరీష్ రావు పనిచేశారని తెలిపారు రేవంత్. బీజేపీ బీఆర్ఎస్ ఒప్పందం ప్రకారమే కవితకు బేయిల్ వచ్చిందన్నారు.

అలాగే హైడ్రాను ప్రస్తుతం హైదరాబాద్‌కే పరిమితం చేస్తున్నట్లు వెల్లడించారు. FTL , బఫర్ జోన్, పార్కులు, నాలల కబ్జాల పైన చర్యలే మా మొదటి ప్రాధాన్యం అని, కబ్జా చేసిన ఎవరిని వదిలిపెట్టమన్నారు. బఫర్ జోన్ లో నా కుటుంబ సభ్యులు, బంధువుల భవనాలు ఉంటే వివరాలు ఇవ్వండి నేనే దగ్గరుండి కూల్చివేపిస్తానని చెప్పారు.

కేటీఆర్ ఫామ్ హౌజ్ లీజ్ తీసుకున్న విషయం ఎన్నికల అఫిడవిట్ లో చూపించారా ? చెప్పాలన్నారు. చూపించకుంటే న్యాయ విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని..
కేటీఆర్ స్నేహితుడు బఫర్ జోన్ లో ఫామ్ హౌజ్ కడితే నిబంధనలు ఉల్లంఘించిన ప్రాపర్టీస్ కేటీఆర్ ఎలా లీజుకు తీసుకుంటాడు? అని ప్రశ్నించారు రేవంత్. ప్రజాప్రతినిధులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలని సూచించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -