Saturday, May 3, 2025
- Advertisement -

జపాన్‌లో సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో..

- Advertisement -

తెలంగాణకు పెట్టుబడులతో రావాలని, చైనా ప్లస్ వన్ ప్రత్యామ్నాయంగా ఎదుగుతోన్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టి అభివృద్ధి చెందాలని జపాన్ పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానం పలికారు. టోక్యోలోని హోటల్ ఇంపీరియల్‌లో “భారత్ – జపాన్ దేశాల మధ్య సంబంధాలు : తెలంగాణపై ఫోకస్ : జపాన్ పెట్టుబడులకు తెలంగాణలో ఉన్న విస్తృత అవకాశాలు” అన్న అంశంపై జరిగిన సదస్సులో ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేశారు.

రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనేక అవకాశాలను సమగ్రంగా వివరించారు. వివిధ రంగాలకు చెందిన 150 మందికి పైగా జపాన్ పారిశ్రామికవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముఖ్యమంత్రి గారు జపాన్ వ్యాపారవేత్తలను సాదరంగా ఆహ్వానించారు. భారతదేశంలోనే అతిపిన్న రాష్ట్రమైన తెలంగాణ, వేగంగా అభివృద్ధి చెందుతూ మీకు హృదయ పూర్వక స్వాగతం పలుకుతోంది. జపాన్‌ను ఉదయించే సూర్యుడి దేశం అని పిలుస్తారు. మా ప్రభుత్వ నినాదం ‘తెలంగాణ రైజింగ్’. ..ఈ రోజు తెలంగాణ జపాన్‌లో ఉదయిస్తోంది అని ఉద్ఘాటించారు.

టోక్యో చాలా గొప్ప నగరం. ఇక్కడి మౌలిక సదుపాయాలు, పర్యావరణ పరిరక్షణ, ఆవిష్కరణలు అద్భుతం. జపాన్ ప్రజల సౌమ్యత, మర్యాద, క్రమశిక్షణ నన్ను ఎంతగానో ఆకర్షించాయి. హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడానికి టోక్యో నుంచి చాలా నేర్చుకున్నాం అని పేర్కొన్నారు. ఈ వేదికపై తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో నిర్మిస్తున్న దేశంలోనే మొదటి నెట్ జీరో ఇండస్ట్రియల్ సిటీ ‘ఫ్యూచర్ సిటీ’ మరియు మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్ట్‌లకు సంబంధించిన ప్రచార వీడియోలను ప్రదర్శించారు. రోడ్‌షో అనంతరం, తెలంగాణ ప్రతినిధి బృందం జపాన్‌లోని పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించింది, భవిష్యత్ సహకార అవకాశాలను చర్చించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -