బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై మరోసారి సంచలన కామెంట్స్ చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ పర్యటన సందర్భంగా మీడియా చిట్‌చాట్‌గా మాట్లాడిన రేవంత్.. మాజీ సీఎం కేసీఆర్ గవర్నర్ కాబోతున్నారంటూ చెప్పుకొచ్చారు.
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అయిన మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులకు ఏ పదవులు దక్కుతాయో చెప్పేశారు రేవంత్. కేంద్రమంత్రిగా కేటీఆర్, తెలంగాణలో హరీశ్ రావు ప్రతిపక్ష నేత అవుతారని వెల్లడించారు.
వాస్తవానికి కేటీఆర్ – హరీష్ రావు ఇటీవల ఢిల్లీ వెళ్లగా బీజేపీ- బీఆర్ఎస్ విలీనంపై వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఈ వార్తలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి వార్తలు ప్రచారం చేసే సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. దీనిపై బీజేపీ నేతలు బండి సంజయ్, కిషన్ రెడ్డి సైతం స్పందించిన సంగతి తెలిసిందే. బీజేపీ – బీఆర్ఎస్ విలీనం వార్తలను తాము పేపర్‌లోనే చూశామని ఎలాంటి చర్చలు జరగలేదన్నారు. ఈ రేపథ్యంలో బీజేపీ – బీఆర్ఎస్ విలీనంపై మరోసారి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.