కొత్త జిల్లాల ఏర్పాటుకు డేట్ ఫిక్స్ చేసిన సీఎం జగన్…

- Advertisement -

ఎన్నికల్లో గెలిచి అధికార పీఠం ఎక్కినప్పటి నుండి ప్రజలకు సుపరిపాలన అందించాలని నిరంతరం జగన్ ప్రయత్నిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పథకాలు పథకాలు అమలు చేస్తున్నారు. సీఎంగా తాను ఏంటో 100 రోజుల పాలనలో నిరూపించుకున్నారు. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నా రు జగన్. తెలంగాణాలో కొత్త జిల్లాల ఏర్పాటు మాదిరి ఏపీలో కూడా కొత్త జిల్లా ఏర్పాటుకు జగన్ సిద్దమవుతున్నారు. ఎన్నికల సమయంలో ప్రతి పార్లమెంట్ నియోజక వర్గాన్ని ఒక జిల్లాగా మారుస్తానని మాట ఇచ్చిన జగన్ ఇప్పుడు ఆమాటను నిలబెట్టుకుంటున్నారు.

అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రక్రియను చేపట్టాలని భావించిన జగన్ వాయిదావేశారు. స్థానిక సంస్థల ఎన్నికల తరువాతే కొత్త జిల్లాల ఏర్పాటు చేయాలని సీఎం జగన్ భావించారు. అయితే తాజాగా కొత్త జిల్లాల ఏర్పాటు అంశంపై సీఎం జగన్ మరోసారి దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఇటీవల గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసినప్పుడు చర్చించారని సమాచారం.

- Advertisement -

ఈ కొత్త జిల్లా మార్పు అంశంలో భాగంగా … వచ్చే గణతంత్ర దినోత్సవం రోజు జగన్ కొత్త జిల్లాల మార్పు నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే అంతర్గతంగా కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తులు జరగుుతన్నట్లు సమాచారం.ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేయాలనే ఆలోచనలో ఉన్న జగన్… వీటికి అదనంగా మరికొన్ని జిల్లాలను ఏర్పాటు చేసే అవకాశాలపై కూడా ఆరాతీస్తున్నారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఏపీలో ఏర్పడ బోయే కొత్త జిల్లాలు…?

 1. అరకు
 2. శ్రీకాకుళం
 3. విజయనగరం
 4. విశాఖపట్టణం
 5. అనకాపల్లి
 6. కాకినాడ
 7. అమలాపురం
 8. రాజమండ్రి
 9. నరసాపురం
 10. ఏలూరు
 11. మచిలీపట్నం
 12. విజయవాడ
 13. గుంటూరు
 14. నరసారావు పేట
 15. బాపట్ల
 16. ఒంగోలు
 17. నంద్యాల
 18. కర్నూల్
 19. అనంతపురం
 20. హిందూపుర్
 21. కడప
 22. నెల్లూరు

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -