Tuesday, May 6, 2025
- Advertisement -

జగ్గారెడ్డి సంచలన కామెంట్స్!

- Advertisement -

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా జగ్గారెడ్డి మాత్రం ఓడిపోయారు. ఇక ఈ 5 సంవత్సరాలు తనకు రెస్ట్ ఇవ్వాలని ప్రజలు నిర్ణయించారని వారి నిర్ణయాన్ని శిరోధార్యం వహిస్తానని చెప్పారు.

దీంతో జగ్గారెడ్డి సైలెంట్ అవడం ఖాయమని అంతా భావించారు. కానీ తాజాగా తన గళం వినిపించారు. సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలి హోదాలో తన భార్యను అన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు పిలవాలని హుకుం జారీ చేశారు.బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో చింతా ప్రభాకర్ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నారని… .తాను ఆ విషయాన్ని ఎప్పుడు తప్పుపట్టలేదని చెప్పారు.

ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ వచ్చింది కాబట్టి తన భార్యను అధికార కార్యక్రమాలకు పిలవాల్సిందేనని తెలిపారు. గతంలో మీరు ఏం చేసినా తాను ఎప్పుడు ప్రశ్నించలేదని ఇప్పుడు మాత్రం కుదరదన్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అధికారులందరికి చెబుతున్నానంటూ తెలిపి జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -