Monday, May 5, 2025
- Advertisement -

ప్రతిపక్షాలను బతకనిస్తారా లేదా!

- Advertisement -

అభివృద్ధి జరగాలంటే అధికార పార్టీలో చేరాలని రూల్ ఉందా.. ఇలాగే కొనసాగితే ప్రజాస్వామ్యం బతుకుతుందా.. ప్రతిపక్షాలు బతుకుతాయా అని ప్రశ్నించారు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి జీవన్ రెడ్డి. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ రాశారు జీవన్ రెడ్డి. అభివృద్ధి పేరిట రేవంత్ రెడ్డి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు అని విమర్శించారు.

రాహుల్ గాంధీ విడుదల చేసిన పాంచ్ న్యాయ్ మేనిఫెస్టోలో ప్రజా ప్రతినిధులు పార్టీ ఫిరాయింపులు చేస్తే వారి సభ్యత్వం రద్దు చేయాలన్నారు. కానీ రాహుల్ గాంధీ మాటను పక్కన పెట్టి రాష్ట్ర కాంగ్రెస్ నేతలు పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహిస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీ నుంచి నా రాజకీయ జీవితం ప్రారంభం అయ్యింది…ఇందిరా గాంధీ మరణం తరువాత నేను కాంగ్రెస్‌లో జాయిన్ అయ్యాను అన్నారు. 40 ఏండ్లుగా కాంగ్రెస్‌ కోసం పని చేస్తున్నాను.. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను అన్నారు. జగిత్యాలలో కాంగ్రెస్ అంటే జీవన్ రెడ్డి…జీవన్ రెడ్డి అంటే కాంగ్రెస్ అనే విధంగా పేరు తెచ్చుకున్నానన్నారు.

నేను అసెంబ్లీ ఎన్నికల్లో గెలవక పోయిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది…ఎమ్మెల్యేలు ఎందుకు పార్టీ ఫిరాయిస్తున్నారో తెలవదు కానీ.. పార్టీ మారుతున్నారు అన్నారు.
తల్లి లాగా పార్టీని భావించాను కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు తనను ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నారు. రాహుల్ గాంధీ చెప్పింది ఏంటి… మనవాళ్ళు చేస్తున్నది ఏంటి..కేసీఆర్ చేసింది.. మన వాళ్ళు మళ్ళీ అదే చేస్తున్నారు అని లేఖలో పేర్కొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -