Saturday, April 20, 2024
- Advertisement -

వైసీపీలోకి మాజీ కేంద్రమంత్రి

- Advertisement -

ఏపీలో పార్టీలో మారే నేత‌లు ఎక్కువైయ్యారు. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్ది గెలిచే పార్టీ వైపు మొగ్గుచూపుతున్నారు. ఇప్ప‌టికే అధికార టీడీపీ పార్టీ నుంచి ప్ర‌తిప‌క్ష పార్టీ వైసీపీలోకి వ‌ల‌సలు పెరిగిన సంగ‌తి తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ పార్టీ నాయ‌కురాలు, మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరందుకు రంగం సిద్దం చేసుకున్నారు. దీనిలో భాగంగానే ఆమె ఈ రోజు వైసీపీ అధినేత జ‌గ‌న్‌ను క‌ల‌వ‌నున్నారు. వైఎస్ఆర్ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు కిల్లి కృపారాణి కేంద్రమంత్రిగా ప‌ని చేశారు. గ‌త కొంత‌కాలంగా ఆమె కాంగ్రెస్ పార్టీపై అంస‌తృప్తి ఉన్నార‌ని తెలుస్తుంది. పార్టీలో సీనియ‌ర్ నాయ‌కుల‌కు పార్టీలో గౌరవం లేద‌ని , దేనికి కూడా త‌మ‌ను సంప్ర‌దించ‌డంలేద‌ని ఆ మధ్య మీడియా త‌మ బాధ‌ను వెల్ల‌డించారు.

ఈ క్ర‌మంలోనే ఆమె కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.ఈ మేరకు తమ రాజీనామా లేఖలను కిల్లి దంపతులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి పంపించారు. ఈ రోజు జ‌గ‌న్ క‌లిసి వైసీపీలో చేరేందుకు రెడీ అవుతున్నారు. గ‌తంలో ఆమె శ్రీకాకుళం నుంచి పోటీ చేసి గెలిచారు. వైఎస్ జ‌గ‌న్ ఆమె శ్రీకుకాళం ఎంపీగా బ‌రిలో దింపే అవ‌కాశ ఉంది.అయితే ఆమెకు సీటు ద‌క్క‌డం క‌ష్ట‌మ‌నే అంటున్నారు అక్క‌డి స్థానిక నేత‌లు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు వైసీపీ నాయ‌కుల‌ను, కార్య‌క‌ర్త‌ల‌ను చాలా ఇబ్బుందుల‌కు గురి చేశార‌ని, ఇప్పుడు ఆమె పార్టీలో చేరితే స‌హాక‌రించేది లేద‌ని వారు చెబుతున్నారు. మ‌రి దీనిపై పార్టీ అధినేత ఎలా స్పందిస్తారో చూడాలి.

https://www.youtube.com/watch?v=IiKW_Gj0KrY

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -