ఏపీ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా పలు చోట్ల హింసాత్మక సంఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. పల్నాడు, కారంచేడు, తాడిపత్రి, చంద్రగిరి, నర్సీపట్నం ప్రాంతాల్లో హింసతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో కౌంటింగ్ డే రోజున హింసాత్మక ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ గుప్తాలకు ఆదేశాలు జారీ చేసింది ఈసీ.
ఈ మేరకు ఈసీ అధికారులతో దాదాపు 55 నిమిషాల పాటు సమావేశం జరుగగా ఎన్నికల అనంతరం రాష్ట్రంలో చెలరేగిన హింసపై ఈసీకి వివరాలు అందజేశారు సీఎస్, డీజీపీలు. ఇక ముందు ఎలాంటి గొడవలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఈసీ స్పష్టమైన ఆదేశాలిచ్చింది.
పోలింగ్ రోజున జరిగిన అల్లర్ల నేపథ్యంలో పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా పని తీరుపై ఆరోపణలు వెల్లువెత్తాయి. టీడీపీ నేతల సూచనలకు అనుగుణంగా దీపక్ మిశ్రా బదిలీలు చేశారని వైసీపీ నేతలు ఆరోపించారు.