Saturday, May 3, 2025
- Advertisement -

కాంగ్రెస్‌లో చేరిన దానం,రంజిత్‌ రెడ్డి

- Advertisement -

తెలంగాణలో పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. సీఎంగా రేవంత్ రెడ్డి 100 రోజుల పాలన పూర్తి చేసుకోగా ప్రజా పాలన అంటూ ముందుకు సాగుతున్నారు. ఓ వైపు పాలన మరోవైపు పార్టీలో చేరికలతో కాంగ్రెస్‌లో జోష్ నింపుతున్నారు రేవంత్.

ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీల నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్‌లో నేతలు చేరుతున్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ నుండి ఎంపీలు, ఎమ్మెల్యేలు చేరుతున్నారు. నిన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ సమక్షంలో పార్టీలో చేరారు వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్.

ఇక ఇవాళ ఖైరతబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దానం నాగేందర్‌ గతంలో కాంగ్రెస్ నుండి మంత్రిగా పనిచేయగా రంజిత్ రెడ్డి గత ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -