సీఎం చంద్రబాబు నాయకత్వంలో KIA మోటార్స్‌తో సహా అనేక కీలక పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్‌లో స్థాపించబడ్డాయన్నారు మంత్రి నారా లోకేశ్. KIA తయారీ కేంద్రాన్ని అనంతపురంలోకి తీసుకువచ్చారు అన్నారు. అసెంబ్లీలో మీడియాతో మాట్లాడిన లోకేశ్… రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమల అభివృద్ధిని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.
1998 డిఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు పోస్టింగ్స్ విషయమై బిజెపి శాసనసభ్యుడు విష్ణుకుమార్ రాజు అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానమిచ్చారు లోకేశ్. అయిదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళతామన్నారు. గతంలో డిఎస్సీపై పడిన కేసులను స్టడీ చేసి, లీగల్ లిటిగేషన్ లేకుండా చూడాలని అధికారులను ఆదేశించాం అన్నారు.
ప్రజాదర్బార్ లో డిఎస్సీ 1998 క్వాలిఫైడ్ అభ్యర్థులు తనని కలిశారన్నారు. 1998 డిఎస్సీకి సంబంధించి పెండింగ్ లో ఉన్న 4,534 పోస్టుల్లో 3939 పోస్టులు భర్తీచేశారు, ఇంకా 595 పోస్టులు భర్తీచేయాల్సి ఉందన్నారు.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తొలి సంతకం మెగా డిఎస్సీ ఫైలుపైనే పెట్టారు అన్నారు.
అభ్యర్థుల విన్నపాల మేరకు తొలుత టెట్ నిర్వహించాం… త్వరలోనే డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తాం అన్నారు. నిరుద్యోగులంతా మనవైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యమంత్రి నన్ను ఉపాధి కల్పన సబ్ కమిటీ చైర్మన్ గా నియమించారని తెలిపారు.