Saturday, May 3, 2025
- Advertisement -

సంక్షోభంలో విద్యారంగం!

- Advertisement -

కూటమి ప్రభుత్వ హయాంలో విద్యారంగం సంక్షోభంలో చిక్కుకుందని మండిపడ్డారు వైసీపీ నేత మేరుగ నాగార్జున. వైసీపీ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడిన నాగార్జున..విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ విఫలమయ్యారని మండిపడ్డారు.

విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేయడమే కాదు జగన్ పాలనలో చేపట్టిన సంస్కరణలను రద్దు చేయడం దారుణమన్నారు. ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు, ద్విభాషా పాఠ్యపుస్తకాలు,ఐబీ, సీబీఎస్‌ఈ సెలబస్, డిజిటల్ తరగతులు, విద్యార్థులకు టాబ్లెట్‌ల పంపిణీ వంటి కీలక కార్యక్రమాలను రద్దు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివల్ల విద్యార్థులకే కాదు విద్యా రంగం కల్లోలానికి గురి అవుతుందని మండిపడ్డారు.

అలాగే, ఫీజు రీయింబర్స్‌మెంట్, అమ్మ ఒడి వంటి పథకాలకు తగినన్ని నిధులు కేటాయించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. యూనివర్సిటీ వీసీలను రాజీనామా చేయడానికి బలవంతపెట్టడం ద్వారా ప్రభుత్వం ఉద్దేశం బయటపడిందన్నారు. జగన్ నేతృత్వంలో రాష్ట్ర విశ్వవిద్యాలయాలు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాయనీ, NAAC A++ అగ్ర స్థాయి ప్రమాణాలను సాధించాయనీ కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదన్నారు. అసలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వ్యక్తిగత బ్రాండింగ్‌గా మార్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడేనని విమర్శించారు.

ప్రభుత్వ పథకాల్లో సైకిళ్లు, కుట్టు మిషన్లు, నీటి ట్యాంకులు,అంత్యక్రియల షెడ్ల వరకు చంద్రబాబు ఫోటోను ముద్రించలేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యంత విచిత్రంగా పాపడ్ ప్యాకెట్లపైనా చంద్రబాబు చిత్రాన్ని ముద్రించారని ఎద్దేవా చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -