సహజ సిద్దంగా వంటింట్లో ఉండే కొన్ని పదార్థాల ద్వారా ఎన్నో జబ్బులకు చెక్ పెట్టవచ్చు. అందులో ముందువరుసలో ఉండేది యాలకులు(ఇలాచి). యాలకులలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, ఫాస్ఫరస్.. ఇలా ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కఫం, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలను కూడా యాలకుల రసం దూరం చేస్తుంది. ఇంకా రక్తంలో షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుతుంది. మూత్రంలో మంట, మూత్రం రంగు మారడం వంటి సమస్యలను దూరం చేస్తుంది.
ఇలాచీలో పుష్కలంగా ఉండే యాంటీఆక్సిడెంట్లు రక్తపోటును అదుపు చేస్తాయి. క్యాన్సర్ కారక కణాలు పెరగకుండా నిరోధిస్తాయి. వీటిలోని యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాలు ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడకుండా కాపాడుతాయి.
భోజనం చేసిన తర్వాత రెండు యాలకులను నోట్లో వేసుకుంటే చాలు.. తీసుకున్న ఆహారం పూర్తిగా జీర్ణం అవుతుంది. వీటికి జీర్ణశక్తిని మెరుగుపరిచే గుణం మెండుగా ఉంది. వికారం, వాంతి వచ్చినట్లు అనిపిస్తే రెండు యాలకులు తిని చూడండి. ఫలితం మీకే తెలుస్తుంది. నోటి దుర్వాసన తగ్గించి చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి.
ఊపిరితిత్తులకు ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరిచి, శ్వాస సంబంధిత సమస్యల బారిన పడకుండా కాపాడే శక్తి యాలకులకు ఉంది. రక్తంలో చక్కెర శాతం తక్కువ ఉన్నవారు రోజూ రెండు యాలకులు తింటే ఈ సమస్యకు దూరంగా ఉండొచ్చు.