Saturday, May 3, 2025
- Advertisement -

సహనం కొల్పోయిన ఈటల..ఓ వ్యక్తిపై దాడి!

- Advertisement -

తెలంగాణ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సహనం కొల్పోయారు. ఓ వ్యక్తిపై దాడికి పాల్పడ్డాడు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలో ఈ ఘటన జరుగగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పేదల భూములను ఆక్రమించుకున్నాడని ఆరోపిస్తూ ఎంపీ ఈటల ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ ను కొట్టారు. ఈటల దాడి చేసిన తర్వాత అక్కడే ఉన్న బీజేపీ కార్యకర్తలు కూడా కొంతమంది ఆ బ్రోకర్ పై చేయి చేసుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

కొందరు అధికారులు బ్రోకర్లకు కొమ్ముకాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రోకర్లకు సహకరించే అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సాధారణంగా ఈటల రాజేందర్ చాలా కూల్ గా ఉంటారు. ఎవరిపైనా దాడి చేసిన దాఖలాలు లేవు. తొలిసారి ఈటల తన కంట్రోల్ కొల్పోయి ఓ వ్యక్తిపై దాడి చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -