Saturday, May 3, 2025
- Advertisement -

అనంతపురంకు మాజీ సీఎం జగన్

- Advertisement -

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 8న అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఫ్యాక్షన్ హింసకు గురైన కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించనున్నారు జగన్.

ఈ నెల 8న జగన్‌ రాప్తాడు.. రామగిరి మండలంలోని పాపిరెడ్డిపల్లి గ్రామానికి వస్తారని తెలిపారు మాజీ ఎమ్మెల్సీ వెంపల్లి సతీష్ రెడ్డి . లింగమయ్య ఒక నిబద్ధతగల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా గుర్తింపు తెచ్చుకున్నారని తెలిపారు.

ఉగాది రోజున ఆయనను పరిటాల వర్గానికి చెందిన అనుచరులు అతి దారుణంగా హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనను జగన్ తీవ్రంగా ఖండించారు. లింగమయ్య కుటుంబ సభ్యులతో జగన్ ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు.

ఈ సందర్భంగా వారు తమ భద్రతపై ఆందోళన వ్యక్తం చేయగా, జగన్ వారికి ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని… అవసరమైతే న్యాయ సహాయం కూడా అందిస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే వ్యక్తిగతంగా కలుస్తానన్న గతంలో చెప్పిన విధంగానే జగన్ ఈ నెల 8న లింగమయ్య కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -