Sunday, May 4, 2025
- Advertisement -

ఎగ్జిట్ పోల్ ఏదైనా..వైసీపీ వైపే!

- Advertisement -

ఏపీ ఎన్నికల ఫలితాల ఎగ్జిట్ పోల్స్‌లో వైసీపీదే విజయం అని తేలిపోయింది. పోలింగ్ తర్వాత ఇప్పటివరకు వెల్లడైనా ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం వైసీపీనే అధికారం చేపడుతుందని, సీఎం జగన్ మరోసారి గెలుపుబావుటా ఎగురవేస్తారని తేల్చేస్తున్నాయి.

చాణక్య ఎగ్జిట్ పోల్ ప్రకారం వైసీపీ 110-120 స్థానాలతో అధికారంలోకి వస్తుందని తెలిపింది. టీడీపీ కూటమికి 55 – 65 స్థానాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఫస్ట్ సర్వే ఎగ్జిట్ పోల్ ప్రకారం వైసీపీకి 114-124 ఎమ్మెల్యే స్థానాలు 17-20 ఎంపీ స్థానాలు వస్తాయని తెలిపింది. ఇక కూటమికి 50-62 ఎమ్మెల్యే స్థానాలు 5-8 ఎంపీ స్థానాలు గెలిచే అవకాశం ఉందని వెల్లడించింది.

ఏపీలో మళ్ళీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయం అని అమేజ్ పొలిటికల్ సొల్యూషన్ సర్వే తెలిపింది. వైసీపీ 114 ఎమ్మెల్యే,21 ఎంపీ స్థానాలు గెలుస్తుందని కూటమికి 38 ఎమ్మెల్యే ,3 ఎంపీ స్థానాలు వచ్చే అవకాశం ఉందని 23 ఎమ్మెల్యే స్థానాల్లో టఫ్ ఫైట్ ఉందని వెల్లడించింది.

పొల్ స్ట్రాటజీ గ్రూప్ పోస్ట్ పోల్ సర్వే ప్రకారం వైసీపీ 115-125 స్థానాలతో అధికారంలోకి వస్తుందని తెలపగా టీడీపీ కూటమి 50-60 స్థానాలకు పరిమితం అవుతుందని వెల్లడించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -