Sunday, May 4, 2025
- Advertisement -

ఫ్రై చేసిన ఐటమ్స్‌..క్యాన్సర్ ముప్పు!

- Advertisement -

ఈ మధ్య కాలంలో ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ తినే వారి సంఖ్య పెరిగిపోయింది. ముఖ్యంగా ఫ్రై ఐటమ్స్ లేకుండా భోజనం తినలేని పరిస్థితికి వచ్చేశారు. అయితే ఇలా ప్రతీ రోజు ఫ్రై ఐటమ్స్ తినడం వల్ల క్యాన్సర్ ముప్పు పొంచి ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మాంసాన్ని ఎక్కువ సేపు వండడం వల్ల క్యాన్సర్ కారణమయ్యే కారకాలు ఉత్పత్తి అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రాసెస్ చేసిన మాంసాన్ని ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఫ్రై చేయడం వల్ల క్యాన్సర్​ను వ్యాపించే కార్సినోజెన్స్ అనే రసాయానాలు ఉత్పత్తి చేస్తుందని హెచ్చరిస్తున్నారు. తక్కువ ఉష్ణోగ్రత వద్ద నల్లగా కాకుండా చూసుకోవాలని చెబుతున్నారు.

మనలో చాలా మంది బ్రెడ్​తో ఆమ్లెట్, టోస్ట్ లాంటి రకరకాల వంటకాలు చేసుకుంటారు. అయితే, వీటిని ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద వేడి చేయడం వల్ల క్యాన్సర్ కారక అక్రిలైమైడ్ ఉత్పత్తి అవుతుందని తెలిపారు. అలాగే చాలా మంది ఫ్రై కోసం వాడిన నూనెను తిరిగి ఉపయోగిస్తుంటారు. ఇలా చేయడం వల్ల అందులో నుంచి క్యాన్సర్ కారకాలు ఉత్పత్తి అవుతాయని హెచ్చరిస్తున్నారు.

ఇక చిప్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. అయితే, బంగాళ దుంపలను చాలా సేపు అధిక ఉష్ణోగ్రతల వద్ద నూనెలో వేయించడం వల్ల హానీకారక అక్రిలైమైడ్ అనే రసాయనం ఉత్పత్తి అవుతుందని తెలిపారు. అందుకే చిప్స్ కాకుండా వీటిని ఉడకబెట్టడం లేదా బేక్ చేసుకుని తినాలని సూచిస్తున్నారు. అలాగే చికెన్, చేపలను ఫ్రై చేయడం మంచిది కాదని దీనివల్ల హానీకారక రసాయనాల ఉత్పత్తి అవుతాయని కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -