Saturday, May 3, 2025
- Advertisement -

జగన్ హయాంలోని ప్రాజెక్టులకే మళ్లీ శంకుస్థాపనా!

- Advertisement -

జగన్ హయాంలో వచ్చిన ప్రాజెక్టులకే మళ్ళీ శంకుస్థాపనలు చేస్తూ ఆర్భాటం చేస్తున్నారు అని ఆరోపించారు వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి. వైయస్‌ జగనే సీఎంగా ఉండి ఉంటే…ప్రజలకు సంక్షేమ పథకాలన్నీ వచ్చేవి అన్నారు. ప్రతి నెలా క్యాలెండర్ ప్రకారం ప్రతి పథకాన్నీ అందించేవారు. ఈ ఎనిమిది నెలల్లో కూటమి ప్రభుత్వం ఒక్క పథకాన్నీ ఇవ్వలేదు కానీ…రూ.1,20,000కోట్ల అప్పు చేసిందని మండిపడ్డారు.

గత ప్రభుత్వం 30 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు ఇస్తే పదేపదే చంద్రబాబు నిందలు వేశాడు అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నేరం అని ప్రచారం చేసి ఇప్పుడు అదే కంటిన్యూ చేస్తున్నాడు… దేశంలోనే సంపన్న ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు ఇప్పటికైనా పేద ప్రజల గురించి ఆలోచించాలి. పెన్షన్‌ పెంచానని చెబుతూ ఉన్న పెన్షన్లలలో కోత పెడుతున్నాడు. 50 ఏళ్లు దాటిన బీసీలకు పెన్షన్‌ వచ్చే ఫిబ్రవరి నుంచి అయినా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు. .

ఉద్యోగాలు ఇవ్వలేం…చొక్కాలు చించుకుని, బైకుల మీద తిరగమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిస్తున్నాడన్నారు. యువతను పెడదోవ పట్టించడమే పవన్ కళ్యాణ్ ఉద్దేశ్యమా? ఎక్కడ చూసినా గంజాయి, ఇంటింటికీ మద్యం..మహిళలు, పిల్లలపై వేధింపులు, అత్యాచారాలు… ఇదే కూటమి ప్రభుత్వం సాధించిన ప్రగతి చెప్పాలన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -