Saturday, May 3, 2025
- Advertisement -

రెండెకరాల నుండి వెయ్యి కోట్లా?

- Advertisement -

దేశంలోనే అత్యధిక ధనవంతుడైన సీఎంగా చంద్రబాబు నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆస్తులపై స్పందించారు మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్. మంగళవారం విశాఖ‌లోని వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన అమర్‌నాథ్‌….రెండెకరాల బాబూ.. వెయ్యి కోట్లు ఎలా సంపాదించాడో చెప్పాలన్నారు. రైతుల పెట్టుబడి సాయం రూ.20 వేలు ఏమైంది?, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎప్పుడు ఇస్తారు? చెప్పాలన్నారు.

మ‌హిళ‌ల‌కు ఉచిత బస్సు ప్రయాణం ఉందా? చెప్పాలన్నారు. నిరుద్యోగ యువతను చంద్రబాబు మోసం చేశారని నిలదీశారు. జగన్ తన పాలనలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించారు అన్నారు. ఐదేళ్లలో 2.75 లక్షల కోట్లు ప్రజల ఖాతాలో వేశారు అన్నారు.

తల్లికి వందనం, నిరుద్యోగ భృతి, అన్నదాత సుఖీభవ పథకాలు లేదు. మహిళకు ఉచిత బస్సు ప్రయాణం, ఒక్కొక్క మహిళకు 1500 రూపాయలు ఎప్పుడు ఇస్తారు చెప్పాలన్నారు. గతంలో 400 కోట్లు ఉంటే దేశంలో ధనిక సీఎం జగన్ అని ప్రచారం చేశారు. సుమారు రూ. 950 కోట్లు చంద్రబాబు సంపాదించారు…చంద్రబాబు ఆస్తుల పక్కన ఒకటో రెండో సున్నాలు మర్చిపోయి ఉంటారు అని ఎద్దేవా చేశారు. ప్రధాని పర్యటన ముందే స్టీల్ ప్లాంట్ పై కూటమి తమ వైఖరిని చెప్పాలన్నారు అమర్‌నాథ్‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -