Sunday, May 4, 2025
- Advertisement -

వైసీపీ అభివృద్ధి పనులకు టీడీపీ బ్రాండింగ్!

- Advertisement -

వైసీపీ చేసిన అభివృద్ధి పనులను టీడీపీ చేసినట్లు బ్రాండింగ్ చేసుకోవడం కరెక్ట్ కాదన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్. శ్రీసిటీలో పరిశ్రమల ప్రారంభం, శంకుస్థాపన చేశారు..ఓ పరిశ్రమ రావాలంటే ఎంత టైం పడుతుందో తెలుసా అని టీడీపీ నేతలను ప్రశ్నించారు. ఓ పరిశ్రమ రావడం, అనుమతులు రావాలంటే కనీసం 6 నెలలు సమయం పడుతుంది కానీ ప్రభుత్వం వచ్చి రెండు నెలల్లో పరిశ్రమలు ఎలా వచ్చాయో చెప్పాలన్నారు. వైసీపీ తెచ్చిన పరిశ్రమలను మీరు ప్రారంభించారని గుర్తించాలన్నారు.

రాష్ట్రాభివృద్ధి కోసం అనేక పోర్టులు నిర్మాణం చేశాం అని తెలిపారు అమర్‌నాథ్. మార్కెటింగ్ లో సీఎం చంద్రబాబును మించిన వారు లేరని…. శ్రీసిటీతో పాటు అనేక ప్రాంతాల్లో పరిశ్రమలకు పెద్దపీట వేశామన్నారు. మీరు ఏం చేస్తారు, ఎలాంటి అభివృద్ది చేస్తారో చెప్పడం లేదు…. మేము చేసిన పనులకు మీరు బ్రాండింగ్ చేసుకోవడం మంచిది కాదు అని సూచించారు.

అనకాపల్లి జిల్లాలో నలుగురు పిల్లలు మృతి చెందడం దిగ్భ్రాంతి కలిగించిందన్నారు. ఇంతటి నిర్లక్ష్యంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని …ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -