Sunday, May 4, 2025
- Advertisement -

సోషల్ మీడియాతోనే కాంగ్రెస్ గెలుపు!

- Advertisement -

సోషల్ మీడియాతోనే కాంగ్రెస్ గెలిచిందన్నారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి భార్య శ్వేత రెడ్డి అనారోగ్యంతో మృతి చెందడంతో ఎమ్మెల్యే హరీష్ రావు లక్ష్మారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన హరీశ్..ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

యూట్యూబ్/సోషల్ మీడియా లేకపోయి ఉంటే కాంగ్రెస్ పార్టీ గెలుపు ఉండేది కాదన్నారు. అధికారంలోకి రాగానే అన్ని మర్చిపోయావా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. యూట్యూబర్లపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

అధికారంలో రాకముందు ఈ యూట్యూబ్ ఛానల్‌ని అడ్డం పెట్టుకొని అడ్డమైన వ్యాఖ్యలు చేసి అవాస్తవాలను వాస్తవాలు చేసింది నువ్వు కదా అని ప్రశ్నించారు. ఇప్పుడు అవే యూట్యూబ్ ఛానల్‌నీ అక్రమాలను, నీ మాట తప్పిన తీరును, నీ మోసలను ఎండ కట్టడానికి పనిచేస్తున్నాయని నిలదీశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -