Saturday, May 3, 2025
- Advertisement -

ఛాలెంజ్ చేసి నిర్బందిస్తారా?

- Advertisement -

తిరుపతిలో హైటెన్షన్ నెలకొంది. గోశాల పై నెలకొన్న రాజకీయం టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య మాటలయుద్దానికి దారితీయగా పోలీసుల ఎంట్రీతో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ ఎమ్మెల్యే సవాల్‌తో తన నివాసం నుండి గోశాలకు బయలుదేరారు. ఎంపీ గురుమూర్తి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామితో కలిసి ఎస్వీ గోశాలకు బయలుదేరారు. భారీ సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు రావడంతో భూమన కరుణారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు.

దీంతో భూమన, వైసీపీ నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కూటమి ఎమ్మెల్యేలు పులివర్తి నాని, బొజ్జల సుధీర్ రెడ్డి, ఆరణి శ్రీనివాసులతో పాటు టీటీడీ సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి తదితరులు గురువారం ఉదయం గోశాల వద్దకు వెళ్లారు.

గోశాల నుంచే భూమున కరుణాకర్ రెడ్డికి కూటమి నేతలు ఫోన్ చేశారు. అసత్య ఆరోపణలు చేయడం కాదని, క్షేత్ర స్థాయికి రావాలని కోరారు. పోలీసుల సూచనల మేరకు ఐదుగురితో గోశాల వద్దకు రావాలని కోరారు. ఎమ్మెల్యేల ఫోన్ నేపథ్యంలో గోశాలకు వస్తానని భూమన తెలిపారు. టీడీపీ నేతలు ఛాలెంజ్ విసిరి తనను పోలీసులతో నిర్బందించడం ఏంటని ప్రశ్నించారు.

టీటీడీలో గత మూడు నెలల్లో గోశాలలో వందకుపైగా గోవులు మరణించాయని భమన సంచలన ఆరోపణలు చేశారు. ఈ మరణాలకు ఎన్డీయే కూటమి ప్రభుత్వం, టీటీడీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అయితే దీనిని టీడీపీతో పాటు టీడీపీ నేతలు సైతం ఖండించారు. ఒకరికొకరు సవాల్‌ విసురుకోవడంతో ఒక్కసారిగా పొలిటికల్ వాతావరణం హీటెక్కింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -