Saturday, May 3, 2025
- Advertisement -

జానీ మాస్టర్ కు బెయిల్ మంజూరు

- Advertisement -

లైంగిక వేధింపుల కేసులో జైలులో ఉన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు బెయిల్ మంజూరు అయింది. అక్టోబర్ 18న తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన జానీ మాస్టర్ కు గురువారం కండిషనల్ బెయిల్ కు మంజూరు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.దీంతో 35 రోజుల జైలు జీవితం తర్వాత బయటకు రానున్నారు జానీ మాస్టర్.

లైంగిక ఆరోపణల నేపథ్యంలో సెప్టెంబర్ 15న జానీ మాస్టర్ పై నార్సింగి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో సెప్టెంబర్ 19న జానీ మాస్టర్‌ను నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుండి జానీ మాస్టర్ చంచల్‌గూడ జైల్లోనే ఉన్నారు.

ఇటీవలె జానీ మాస్టర్‌కు వచ్చిన జాతీయ అవార్డును సైతం రద్దు చేశారు. జైలు నుండి బయటికి వచ్చిన తర్వాత బాధితురాలితో జానీ మాస్టర్ కానీ, జానీ మాస్టర్ కుటుంబ సభ్యులు తలదూర్చకూడదని ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం ఉదయం జానీ మాస్టర్ చెంచల్‌గూడ జైలు నుండి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -