భారత్ శ్రీలంక మధ్య జరిగిన తొలి వన్డే డ్రాగా ముగిసింది. శ్రీలంక విధించిన 231 పరుగుల లక్ష్య చేధనలో ఓ దశలో టీమిండియా గెలుపు సునాయసమే అనుకున్నారు. ఓపెనర్ రోహిత్ శర్మ ధాటిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. ఫోర్లు, సిక్సర్లతో శ్రీలంక బౌలర్లపై విరుచుకపడ్డాడు. రోహిత్ ధాటికి భారత్ 12 ఓవర్లలోనే 75 పరుగులు చేసింది. అయితే ఈ క్రమంలో వెంటవెంటనే వికెట్లు కొల్పోయింది. రోహిత్ మినహా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అంతా విఫలమయ్యారు.
33 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. దీంతో వన్డేల్లో 10 ఓవర్లలోపు ఎక్కువ హాఫ్ సెంచరీలు(3) బాదిన రెండో భారత బ్యాటర్ గా రోహిత్ శర్మ నిలిచాడు. రోహిత్ 58, శుభ్‌మన్ 16, కోహ్లీ 24, వాషింగ్టన్ సుందర్ 5, శ్రేయాస్ 23, కేఎల్ రాహుల్ 31, అక్షర్ పటేల్ 33, శివం దూబె 25, కుల్దీప్ యాదవ్ 2, సిరాజ్ 5 (నాటౌట్) పరుగులు చేశారు. అయితే ఒక్కరొక్కరుగా భారత బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు చేరుతుండటంతో చివరి భారమంతా బౌలర్లపైనే పడింది. ఇక ఒక పరుగులు చేయాల్సిన కీలక తరుణంలో హర్షదీప్ ఎల్బీడ్యబ్లూగా వెనుదిరిగాడు. దీంతో భారత్ 47.5 ఓవర్లకు 230 పరుగులకు ఆలౌట్ అయింది. శ్రీలంక బౌలర్లలో అసలంక,హసరంగ తలో 3 వికెట్లు తీయగా వెల్లగిలే 2,ఫెర్నాండో,ధనుంజయ తలో వికెట్ తీశారు.
ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కొల్పోయి 230 పరుగులు చేసింది. నిస్సాంక 56,మెండీస్ 14,చివరల్లో వెల్లగిలే 67,హసరంగ 24,లియాంగే 20 పరుగులు చేయడంతో ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. భారత బౌలర్లలో హర్షదీప్ ,అక్షర్ పటేల్ తలో 2 వికెట్లు తీయగా సిరాజ్,దూబే,కుల్దీప్,సుందర్, తలో వికెట్ తీశారు.