- Advertisement -
బారత మహిళల క్రికెట్ జట్టు దాయాది పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. ఆసియా కప్ 2024లో భాగంగా తొలి మ్యాచ్‌లో పాక్‌తో తలపడిన భారత జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పాకిస్థాన్ విధించిన 109 పరుగుల లక్ష్యాన్ని 14.1 ఓవర్లలోనే భారత జట్టు చేధించింది. ఓపెనర్లు పెషాలి (40), స్మృతి (45) దూకుడుగా ఆడగా హేమలత 14 , హర్మన్ ప్రీత్ 5 పరుగులు చేశారు.
ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 19.2ఓవర్లలో 108 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీప్తిశర్మ, పూజ, శ్రేయాంక, రేణుక అద్భుత బౌలింగ్‌తో రాణించారు. 20 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టిన దీప్తి శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. ఈ విజయంతో ఆసియా కప్‌ను శుభారంభంతో ప్రారంభించింది టీమిండియా మహిళ జట్టు.